
ఎండల్లో తిరిగినా, నీటిలో నానినా , మంచులో తడిచినా ముందుగా మా శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరిగి జ్వరం వస్తుంది. ఎటువంటి జ్వరానికి వంటగదిలో దొరికే వస్తువులతోనే చికిత్స చేసుకోవచ్చు.
* వాము, ధనియాలు వీటిని దోరగా వేయించి కషాయం పెట్టి తాగితే జ్వరం తగ్గిపోతుంది.
* జీలకర్ర, బెల్లము వీటిని తింటే రోజు విడిచి రోజు వచ్చే జ్వరం తగ్గిపోతుంది.
* పిప్పళ్ళ చూర్ణము తేనెలో కలిపి సేవిస్తే జ్వరం దగ్గు తగ్గుతాయి.
* తిప్పతీగ కషాయంలో పిప్పళ్ల చూర్ణం కలిపి తాగడం వల్ల జ్వరం తగ్గిపోతుంది.
* తెగడ చూర్ణాన్ని ఆఫ్ లీటర్ ఆవుపాలలో కలిపి ఉంటే జ్వరం హరించుకుపోతుంది.
* చేదు పొట్ల, ధనియాల కషాయం ను కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది.
* సీతాఫలం చెట్టు యొక్క బెరడు ను నీటిలో వేసి మరగ కాచి ఆ నీటిని తాగిన జ్వరం తగ్గిపోతుంది.