
కొంతమందికి ముఖం కడుక్కున్న కొద్దిసేపటికే స్కిన్ జిడ్డుగా మారిపోతుంది. ఎన్ని సబ్బులు, పేస్వాష్ ఇంకా క్రీమ్స్ మార్చినా ముఖం కడుకున్న కొద్ది క్షణాల్లో జిడ్డుగారుతూ కనిపిస్తుంది. ఈ సమస్యను చిన్న చిన్న చిట్కాలతో ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. జిడ్డును దూరం చేసే ఆ చిట్కాలను చూసేద్దామా!
* రోజూ రాత్రి వేళ చెంచా పసుపులో కొన్ని పాలు పోసి ముద్దలా చేయండి. ఆ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోండి. 15 నిమిషాల తర్వాత ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. పసుపులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జిడ్డు తత్వాన్ని దూరం చేస్తాయి.
* జిడ్డు చర్మం సమస్య ఉన్నవారు టమాటో ముక్కతో ముఖంపై మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం జిడ్డు తొలగిపోతుంది.
* స్నానానికి పదిహేను నిమిషాల ముందు యాపిల్‌ను పలుచని స్లైసుల్లా కోసి ముఖంపైఉంచాలి. యాపిల్ స్లైసులు చర్మంలోని అధిక నూనెను పీల్చుకొని ఫలితంగా ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
* జిడ్డు చర్మం బాధితులకు నిమ్మరసం మంచి ఔషదం. నిమ్మరసంలో కొద్దిగా నీరు కలిపండి. ఆ ద్రవంలో దూదిని ఉండలుగా చేసి వేయాలి. వాటిని కొద్ది సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత ఒక్కో ఉండను ముఖానికి రుద్ది శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల చర్మంపై మురికి తొలగిపోతుంది. చర్మానికి తేమ అందుతుంది. దీనివల్ల ముఖం జిడ్డుగా మారదు.
నువ్వుల నూనెతో తెల్ల జుట్టును మాయం చేయొచ్చా? ప్రయోజనాలేమిటీ?
* అరకప్పు పెసరపిండిలో సరిపడా పెరుగు, కాస్త నీళ్లు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక చల్లనినీటితో కడిగినట్లయితే జిడ్డు చర్మాన్ని తాజాగా, తేటగా మారుస్తుంది. దీని తరవాత సబ్బు రుద్దుకోకూడదు.
* అర స్పూన్ బేకింగ్ సోడాలో కాస్త నిమ్మరసం కలపండి. మొటిమలూ, యాక్నె సమస్య ఉన్న చోట దాన్ని పూతలా రాయండి. కాసేపటి తర్వాత తడి చేతితో మర్దన చేసి ఆ పూతను తీసేయండి. దీని వల్ల నూనె గ్రంథులు మూసుకుపోయి జిడ్డు సమస్య తగ్గుతుంది. మృతకణాలు తొలగిపోతాయి. మొటిమలు తగ్గుతాయి.
* జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు మేకప్ వేసుకునే ముందు నీళ్లు కలిపిన నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోని పది నిమిషాలయ్యాక కడిగేయాలి.
* స్ప్రే సీసాలో నీళ్లు తీసుకుని అందులో చెంచా ఉప్పు వేయాలి. ముఖం మీద ఆ నీటిని తరచూ స్ప్రే చేసుకుంటూ తుడుచుకోవాలి. కళ్లపై మాత్రం ఆ స్ప్రే పడకుండా చూసుకోవాలి. ఈ నీళ్ల వల్ల జిడ్డు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
* నాలుగైదు బాదంపప్పుల్ని రాత్రంతా నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి ఆ మిశ్రమంలో కాస్త తేనె కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలయ్యాక కడిగేయాలి.
* ముఖం కడిగిన తర్వాత మొక్కజొన్న పిండిలో నీళ్లు కలిపి ముఖానికి పూతలా రాసుకోండి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయండి.