
వర్షాలు కురుస్తు వేళ దగ్గు జలుబు వంటి సమస్యలు ప్రతి ఒక్కరికి సర్వసాధారణం. అయితే జలుబు చేసింది కదా అని వెంటనే మందులు వేసుకోకుండా ఇంట్లో దొరికే వస్తువులతో ఇలా చేస్తే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.
* ఒక అరకప్పు వేడి పాలలో అరచెంచా పసుపు పొడిని కలిపి తాగితే జలుబు పడిశం తగ్గుతాయి.
* పండు జిల్లేడు ఆకుల రసంలో నూనె కలిపి శరీరానికి మర్దన చేస్తే జలుబు తగ్గుతుంది
* పటిక ముక్కను తెచ్చి కాల్చి నూరిన పొడిని ఒక సీసాలో పోసి భద్రపరచుకోవాలి. జలుబు చేసినప్పుడు ఈ పొడి వేడి నీటిలో గానీ పాలలో లేదా టీలో గానీ కొద్దిగా కలుపుకుని రోజుకు మూడుసార్లు చొప్పున తాగితే జలుబు తగ్గుతుంది.
* మిరియాల పొడిని పెరుగులో కలుపుకుని తింటే జలుబు తగ్గుతుంది.
* తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తాగితే జలుబు దగ్గు రెండు తగ్గిపోతాయి.
* నల్ల జీలకర్ర వేయించి చిన్న బట్టలో కట్టి వాసన చూస్తే జలుబు తగ్గిపోతుంది.
* ఒక గ్లాసు అనాస పండు రసంలో ఉప్పు మిరియాల పొడిని కలిపి సేవిస్తుంటే సాధారణ జలుబు తగ్గిపోతుంది.
* ఒక స్పూన్ రేగుపండ్ల రసంలో కొంచెం మిరియాల పొడిని కలిపి తాగితే జలుబు తగ్గుతుంది.
* దాల్చిన చెక్క నూనె లో యూకలిప్టస్ నూనెను బాగా కలిపి ఈ మిశ్రమాన్ని గాఢంగా వాసన చూస్తూ ఉంటే జలుబు తగ్గిపోతుంది.
* మిరియాలు, చిన్న ఉల్లి, ఉప్పు వీటిని కలిపి మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని రొట్టెలో గాని వేడి అన్నంలో గాని తింటూ ఉంటే జలుబు తగ్గిపోతుంది.