
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కీళ్ల నొప్పులతో బాధ పడడం ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. మారిన మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు రకరకాల ఆరోగ్య సమస్యలు వీటికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ కీళ్లనొప్పుల సమస్య తో బాధపడటం సాధారణం అయిపోయింది. అయితే ఈ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కొన్ని సింపుల్ రెమిడీస్ మీకోసం.
* కొబ్బరి నూనెలో కొద్దిగా పిప్పర్మెంట్ తైలమును కలిపి పైపూతగా మోకాళ్ళ పైన రాస్తూ ఉంటే నొప్పులు తగ్గిపోతాయి.
* ఉల్లిపాయను మెత్తగా నూరి ఆవనూనెలో వేసి వేడి చేసి పైభాగంలో పట్టువేస్తే నొప్పులు తగ్గుతాయి.
* ఆముదపు ఆకులను వెచ్చచేసి, కాపడం పెడుతూ ఉంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
* పత్తి గింజల నూనెను పైపూతగా వ్రాస్తూ ఉంటే కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.
* ఆలివ్ ఆయిల్ ను నొప్పులున్నచోట రాస్తూ అంటే కీళ్ల నొప్పులు ఇస్తాయి.
* మినప వేరును మెత్తగా నూరి నొప్పులకు పైపూత మందుగా ఉపయోగిస్తూ ఉంటే త్వరగా నొప్పులు తగ్గుతాయి.
* కొబ్బరి నూనెలో ఇంగువ పొడిని కలిపి పూతగా రాస్తూ ఉంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.