
చాలా మందికి నిద్రలేమితో పాటు ఎన్నో ఇతర సమస్యలు వల్ల కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ వాస్తు ఉంటాయి. మానసిక ఒత్తిడి, హార్మోన్ సమస్యలు, అలర్జీ, డీ హైడ్రేషన్ వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే చిన్న జాగ్రత్తలతో ఈ నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చు.
ఇలాంటి కళ్ల కింద నల్లటి వలయాల సమస్యను పోగొట్టడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. పాలలో విటమిన్ ఏ, విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు బ్లాక్ స్పాట్స్‌ను తొలగించి. కొత్త చర్మకణాలు ఏర్పడేందుకు దోహదపడతాయి. పాలల్లో కొంచెం శనగపిండి వేసి..ఆ పేస్ట్‌ను కళ్ల కింద అప్లై చేసుకోవాలి. దీంతో పూర్తిగా ఎండిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.
అలాగే హెర్బల్ టీ తాగడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి. ఒక పాత్రలో అల్లం, తులసి ఆకులు, కుంకుమ పువ్వు వేసి మరిగించాలి. ఆ తర్వాత టేస్ట్ కోసం తేనె కలుపుకోవాలి. ప్రతి రోజు ఉదయం ఈ హెర్బల్ టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
గ్రీన్ టీ తాగిన తర్వాత.. టీ బ్యాగ్‌ని కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలపై కాసేపు ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల బ్లాక్ సర్కిల్స్ మాయమవుతాయి. అలాగే కీర దోసకాయ లు కూడా చక్కగా పనిచేస్తాయి. కీర దోసకాయ, నిమ్మకాయ రసాన్ని మిక్స్ చేసి దాంతో కళ్ల కింది భాగంలో సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. పీనట్ బటర్, కొబ్బరి తినడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి. అంతేకాదు డార్క్ చాక్లెట్ తింటే కూడా కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయి.