
ఎక్కిళ్ళు అదేపనిగా మిమ్మల్ని వేదిస్తున్నాయా! ఏం చేసినా ఎక్కిళ్ళను ఆపలేకపోతున్నారా? అయితే ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి మరి.
* వేడివేడి ఆవుపాలను అరలీటర్ వేడివేడిగా త్రాగినా, చెరుకు రసమును తాగినా ఎక్కిళ్లు హరించును.
* మేక పాలలోశొంఠి చూర్ణమును అర తులమువేసి,కాచి త్రాగు చుండిన ఎడల ఎక్కిళ్ళు హరించును.
* మిరియాలు, వాము వీటిని సమభాగములుగా కలిపి, ఆ మిశ్రమమును నిప్పుల మీద వేసి, ఆ పొగను పీల్చుచుండిన ఎడల ఎక్కిళ్ళు హరించును.
* పావుతులము యష్టిమధుకము చూర్ణం అర తులము తేనెలో కలుపుకొని, తింటున్న ఎక్కిళ్లు హరించును.
* దానిమ్మ మొగ్గలు, తులసి దళములు, గడ్డి ఈమూడు వస్తువులను సమభాగములుగా తీసికొని,నూరి,రసముపిండి, వడగట్టుకుని, ఈ రసమును నాలుగు చుక్కలు ముక్కు రంధ్రముల లో వేయుచుండిన ఎక్కిళ్ళు హరించి పోవును.
* ఒక తమలపాకులో కుంకుమపువ్వు నాలుగైదు ఈనలను వేసి, బాగా నమిలి, మింగిన ఎడల ఎక్కిళ్ళు హరించిపోవును.
* నేలతాడిదుంప, ఉత్తరేణి వేరు ఈ రెండిటిని సమముగా నూరి,త్రాగుచుండిన ఎడల ఎక్కిళ్ళు కట్టును.
* సైంధవలవణపు చూర్ణమును నీటిలో బాగా కలిపి నాలుగైదు చుక్కలు ముక్కు రంధ్రములలో వేయిచుండిన ఎక్కిళ్ళు హరించును.
* శ్వాసను నిరోధించి ప్రాణాయామము చేయుచుండిన ఎడల అసాధ్యములేనా ఎక్కిళ్ళు కూడా హరించును.
* ఉసిరికాయల రసము 3తులములు, పిప్పళ్ళ చూర్ణం బేడెత్తు, తేనె 2 తులములు వీటిని కలుపుకుని రోజూ రెండు పూటలా పుచ్చుకోనున్న ఎక్కిళ్ళు హరించును.
* హరి!హరి!అని బిగ్గరగా అరుచుచున్నాను ఎక్కిళ్లు ఆగిపోవును.