
ప్రతి రోజు ఎదో ఒక రూపంలో అల్లం కనుక మనం తీసుకున్నట్టు అయితే అనారోగ్యాలు దరిచేరవు. అల్లం వంటల్లోనే కాక సౌందర్య పోషణలోనూ శ్రేష్ఠమైనదిగా పేర్కొనబడినది. అల్లంలో ఉన్న ఔషద గుణాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
* అల్లము, బిళ్ళగన్నేరు ఆకులు, పసుపు,సైంధవ లవణము, ఇంగువ, మెంతులు వీటిని సమభాగములుగా కలిపి నూరి, ప్రతిరోజు పూటకు కుంకుడు గింజ ప్రమాణములో మజ్జిగలో కలిపి, వాడుతుంటే మధుమేహము తగ్గుతుంది. అంతేకాదు క్యాన్సర్ వ్యాధికి తొలిదశలో నివారణోపాయమూగను, తరుణవస్థలో బాధోపశమనముగాను ఇది వాడదగినది.
* తులసిమొక్క ఆకు, అల్లపు రసము, పసుపు వీటిని కలిపి,నూరి, చర్మమునకురాస్తే దద్దుర్లు, దురద, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
* ఆముదము లో అల్లపురసమును కలిపి, చర్మమునకురాస్తే చర్మ రోగములు పోతాయి.
* గోమూత్రము లో మూడు రోజుల పాటు శుద్ధిచేసిన కరక్కాయల చూర్ణమును అల్లపురసములో ఊరబెట్టి, మూకుడులో చూర్ణము మిగిలే వరకూ వేపించి, ప్రతిరోజు మూడు వ్రేళ్ళకు సరిపడ చూర్ణమును గోరువెచ్చని నీటిలో కలిపి, సేవించుచున్న స్లిపదము, రక్తాలు శసు తప్పక తగ్గును.
* ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయ లోని రసము పిండి,దీనిలో రెండు చెంచాల అల్లం రసము,రెండు చెంచాల తేనె, రెండు చెంచాలు ధనియామూల రసములను కలిపి, ఉదయం పూట మాత్రమే తీసుకుంటే అది పదిహేను రోజులలో రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. గుండెదడ,అలసట వివదాహములను పోగొట్టి గుండెకు బలము నిస్తుంది. జలుబును తగ్గిస్తుంది.