
Gujarat Assembly elections: డిసెంబర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ (బిజెపి) గురువారం ప్రకటించింది. సీఎం భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండ్వియా, భూపేందర్ యాదవ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేయనున్నారు.