
Greg Barclay: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే మరోసారి నియమితులయ్యారు. ఇవాళ జరిగిన ఐసీసీ సమావేశంలో గ్రెగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 2020 నవంబర్‌లో గ్రెగ్ తొలిసారిగా ఐసీసీ చైర్మన్‌గా నియమితులైన విషయం తెలిసిందే.