
జన్మదిన శుభాకాంక్షలు గూగుల్
గూగుల్.. దీని గురించి తెలియని వాళ్లు ఈకాలంలో ఎవరూ ఉండరేమో. ఏ విషయం గురించైనా తెలుసుకోవాలంటూ గూగుల్ ఉండాల్సిందే. గూగుల్ జనాలకు బాగా అలవాటుగా మారిపోయింది. అంతగా జనానికి చేరువైన గూగుల్ బర్త్ డేని ఏటా సెప్టెంబర్ 27న నిర్వహిస్తోంది దాని యాజమాన్యం. ఈ ఏడాదితో గూగుల్‌కు 23 ఏళ్లు పూర్తయ్యాయి.
గూగుల్ సంస్థను అధికారికంగా ప్రారంభించింది సెప్టెంబర్ 4, 1998 అయినా.. 2013 నుంచి సెప్టెంబర్ 27ని ‘గూగుల్ బర్త్ డే’గా నిర్వహిస్తున్నారు. దీనికి గల ప్రత్యేక కారణం ఏంటనేది మాత్రం ఇప్పటి వరకు బయటపెట్టలేదు గూగుల్ యాజమాన్యం.