
మెగాస్టార్ చిరంజీవి.. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘గాడ్‌ఫాదర్’. ఇది మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్నారంటూ ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అనధికారిక సమాచారం ప్రకారం ఈ వార్త నిజమేనని తెలుస్తోంది. చిరంజీవికి రైట్ హ్యాండ్ లాంటి ఈ పాత్రలో సల్మాన్ ను ఖాయం చేసిందట చిత్ర బృందం. మరొకొద్ది రోజుల్లోనే సల్మాన్.. ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో మురళీ మోహన్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా.. మరో ప్రధాన పాత్రను సత్యదేవ్ పోషిస్తున్నారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేయబోతున్న పాత్రను ఒరిజినల్ లో ఆ సినిమాకి దర్శకుడైన పృధ్విరాజ్ సుకుమారన్ పోషించారు. ఇటీవల ఓ నేషనల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు తమన్ ఈ వార్తను కన్ఫర్మ్ చేయడంతో చిరంజీవి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు, సల్మాన్ పై ఓ పాట కూడా ఉండబోతోందట. దాంతో ఆ పాట పాడించడం కోసం తమన్ .. క్రేజీ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ను సంప్రదిస్తున్నారట. ఆమెతో ఇంగ్లీష్ ట్రాక్ పాండించాలా లేక వేరే ఏదైనా పాడించాలా అనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు తమన్. దీంతో.. ‘గాడ్‌ఫాదర్’తో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లే తెలుస్తోంది.