
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘గని’. వరుణ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుండగా.. నదియా, నరేశ్, నవీన్ చంద్ర, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 3న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని మొదలు పెట్టారు మేకర్స్.
తాజాగా సునీల్ శెట్టి, ఉపేంద్ర పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఈ ఇద్దరి పాత్రలు చాలా కీలకం అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రేపు విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న గని చిత్రం వరుణ్ తేజకి ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
It was a pleasure working with both of you for #Ghani @SunielVShetty anna!?@nimmaupendra sir!?? pic.twitter.com/3TAfF3HZcR
— Varun Tej Konidela ? (@IAmVarunTej) November 14, 2021