
చాలా మందికి ఎప్పుడూ ఒక సమస్య వేధిస్తూ ఉంటుంది. ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆ సమస్య ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపులో మంట.
ఇది నార్మల్ గా మనం తినే సమయాలు మారినపుడు, మనం తినే టైం కి మధ్య గ్యాప్ రావడం, కొందరి ఆహారపు అలవాట్లు , ఎక్కువగా చాయి తాగడం ఇలాంటి వాటి వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు మంట సమస్యలు వస్తాయి.
దానికి ఏవో పొడిలు , ఇంకోటి ఏవో ఏవో మార్కెట్లో విరివిగా చాలా రకాల మెడిసిన్ దొరుకుతూ ఉంటాయి. కానీ అవి అప్పటి వరకు మాత్రమే రిలీఫ్ ఇస్తాయి.
చాలా మందికి తెలియనిది ఏంటంటే మన ఇంట్లో మనకు అందుబాటులో ఉన్న వాటితోనే ఈ సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. ఒక చెంచా జీలకర్రను రాత్రిపూట పడుకునే సమయంలో ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టి పొద్దున లేవగానే పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా కొన్ని వారాలు చేస్తే ఈ గ్యాస్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
లేదా మార్కెట్లో ఓమా నీళ్లు( వాము వాటర్ ) పేరుతో దొరుకుతుంది, ఈ నీటిని రోజుకు రెండు సార్లు పొద్దున,రాత్రి ఒక రెండు స్పూన్లు తాగితే ఈ గ్యాస్ సంబంధిత సమస్యను తగ్గించుకోవచ్చు.
ఇవి కాకుండా ప్రతి ఒక్కరి ఇండ్లలో నిమ్మకాయలు ఉంటాయి. ఒక నిమ్మకాయ ని కట్ చేసి, ఒక గ్లాస్ మజ్జిగలో కాస్త ఊపు వేసి, ఆ మజ్జిగ లో కట్ చేసిన నిమ్మకాయ రసం పిండుకుని తాగితే గ్యాస్ సమస్య, కడుపులో మంట సమస్యకు మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మిశ్రమం రెగులర్ తీసుకుంటే జీర్ణశయ సంబంధిత వ్యాధులు మన దారికి చేరవు.
కడుపులో మరియు గొంతులో మంట ఉన్నట్లయితే చల్లని పాలు ఒక గ్లాసు తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది.