
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడో ఫ్లోర్లో ఉన్న లేబర్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద ప్రమాదం జరిగింది. దీంతో మంటలు థర్డ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు వ్యాపించాయి. మంటలను చూసి సిబ్బంది, రోగులు బయటకు పరుగులు తీశారు.పలువురు రోగులు ఆస్పత్రి లోపల చిక్కుకుపోయారు. దీంతో మంటల్లో చిక్కుకు పోయిన రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారు.
షార్ట్ సర్య్కూట్ కారణంగా విద్యుత్ బోర్డు ప్యానెల్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదం స్వల్ప స్థాయిలోనే జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఫైర్ సిబ్బంది.. కేవలం 40 నిమిషాలలోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.