
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ F 2:ఫన్ &ఫ్రస్టేషన్ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే కాంబినేషన్ లో ‘F3’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. F 2:ఫన్ &ఫ్రస్టేషన్ మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , దసరా స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శివరాత్రి ఫిబ్రవరి 25 వ తేదీ పర్వదినం సందర్భంగా F3 మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ‘ మూవీలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించినట్టుగానే ‘F3’ మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.