
తెరాస ప్రభుత్వం పై ప్రజలు కక్ష పెరిగింది అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నేడు మీడియా తో మాట్లాడిన ఈటల రాజేందర్… వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ డ్రామా ఆడుతున్నారన్నారు. కొత్త రైస్ మిల్లులు ఏర్పాటు చేయాలనే సోయి కేసీఆర్ కు లేదు అని అన్నారు.
కేసీఆర్ అహంకారాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తే చెంప చెళ్లుమనేలా తీర్పు ఇచ్చిన హుజురాబాద్ ప్రజలు. సమస్య వచ్చినప్పుడు కేంద్రం పై బురద చల్లడం కెసిఆర్ కు అలవాటని వ్యాఖ్యానించారు.