
వీరేంద్ర సెహ్వాగ్!! భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అతని విధ్వంసక ఆటతో
తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత్ లో నే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. కాగా, ఈ డాషింగ్ ఓపెనర్ తాజాగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగుతో అలరించారు. గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ “నాక్కొంచెం తిక్కుంది… దానికో లెక్కుంది” అంటూ పలికిన డైలాగ్ ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సెహ్వాగ్ నోట కూడా అదే డైలాగ్ పలికింది. సెహ్వాగ్ అచ్చం పవన్ లా మెడపై చేతితో రుద్దుకుంటూ ఈ డైలాగు చెప్పడం వైరల్ అవుతోంది. పక్కన ఓ యువతి పవన్ డైలాగును చెబుతుండగా, సెహ్వాగ్ కూడా అదే రీతిలో డైలాగు చెప్పడం వీడియోలో చూడొచ్చు.
https://www.youtube.com/watch?v=OEV-AEuKjM4&t=14s