
విజయాలను ఇచ్చే విజయ దుర్గా ఆశీస్సులతో, ఆ రాజరాజేశ్వరి అమ్మ దీవెనలతో
సకల సౌభాగ్యాలు కలగాలని, సుఖ శాంతులతో ఇంటిల్లిపాది ఉండాలని కోరుకుంటూ “భారత్ మీడియా” పాఠకులకు ‘విజయ దశమి’ ‘దసరా’ శుభాకాంక్షలు.
విజయ దశమి నాడు తప్పకుండా శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని,
‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’
అనే శ్లోకాన్ని పఠించాలి.

జమ్మిచెట్టును పూజించి, ప్రదక్షిణలు చేసిన తర్వాత జమ్మి ఆకును పెద్దలకు ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకోవాలి. ఆడపడుచులను ఆదరించడం, తల్లిదండ్రులను గౌరవించడం, శక్తిమేరకు దానధర్మాలు చేయడం ఈ రోజున చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.