
ఖైరతాబాద్ బడా గణేశ్ రంగుల పని మినహా మిగితా పనులు అంత అయిపోయాయి. బడా గణేష్ రూపం రెడీ అయింది. వినాయక చవితి ఐదు రోజుల ముందు గణేశుడు పూర్తిగా తయారు కానున్నట్లు శిల్పి రాజేంద్రన్, ఉత్సవ సమితి చైర్మన్ సుదర్శన్ తెలిపారు.
కరోనా కారణంగా గత ఏడాది కేవలం 11 అడుగుల ఎత్తు కే పరిమితం చేసారు. కానీ ఈ సరి భక్తుల కోరిక మేరకు 40 అడుగుల ఎత్తులో గణేశుడు ఉండేలా తయారు చేసారు. ప్రతి సంవత్సరం దాదాపు మూడు నెలలకు పైగా కళాకారులు విగ్రహాన్ని సిద్ధం చేసేవారు. ఐతే ఈసారి కొవిడ్ మూడో దశ వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న భయాల నేపథ్యంలో ఎత్తు విషయమై, భక్తుల రాక విషయమై ఎన్నో విధాలుగా చర్చించారు. విగ్రహాన్ని 23 అడుగుల ఎత్తుతో చేయాలని భావించినా.. ఖైరతాబాద్ గణపతిని తక్కువ ఎత్తుతో చూడలేమని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారని నిర్వాహకులు అంటున్నారు.దీంతో వారి కోరిక మేరకు 40 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని చేయక తప్పలేదు.
ఈసారి గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తుతో కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహం ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. పాము పుట్టల నడుమ భారీ నాగ దేవతపై కొలువుండే విధంగా కాల నాగేశ్వరి అమ్మవారిని ప్రత్యేక వేసిన సెట్టింగ్ ల మధ్య తయారు చేస్తున్నారు.
ఎడమ వైపున శ్రీకృష్ణుడిని ఆవహించిన కాళికా దేవి స్వరూపమైన కృష్ణకాళి రూపంలో మరో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. భాగవతం సమయంలో శ్రీకృష్ణుడు కాళీ మాతను పూజించి అనుగ్రహించాలని కోరగా ఆమె శ్రీకృష్ణుడిపైనే ఆవహించిన స్వరూపంగా కృష్ణకాళి ఉగ్ర స్వరూపంతో ఇక్కడ కొలువుతీరనుంది. ఆమె పక్కన కృష్ణుడి మాతృమూర్తి యశోదాదేవిసైతం భక్తులకు కనపడేలా తీర్చి దిద్దారు