
Dasara Trailer Event: నాచురల్ స్టార్ నాని హీరోగా నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దసరా‘. మార్చి 30న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ని మార్చి 14న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.
కాగా తాజాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని లక్నోలోని ప్రతిభ థియేటర్ లో మధ్యాహ్నం 3.30 నిమిషాల నుంచి గ్రాండ్ గా జరుపనున్నట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ ప్రకటించింది.