
Dasara Movie: నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘దసరా’ ఈ నెల 30న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ను జారీ చేసింది.
అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమాలో ఏకంగా 36 కట్స్ చెప్పింది. ఎక్కువగా డైలాగ్ కట్స్ చెప్పిందని సమాచారం. కాగా, ఇంత మొత్తంలో కట్స్ చెప్పిన తొలి తెలుగు సినిమాగా దసరా రికార్డు క్రియేట్ చేసింది.