
Dasara Day1 collections: నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా భారీ పాన్ ఇండియా మాస్ చిత్రం “దసరా”. అయితే ఈ సినిమా నిన్ననే భారీ ఎత్తున విడుదలై కలెక్షన్లు కూడా ఊహించినంతగా రికార్డు స్థాయిలో నమోదు చేస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.14.22 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. గ్రాస్ లెక్కల్లో చూస్తే ఈ కలెక్షన్స్ రూ. 24.85 కోట్లు అని ట్రేడ్ వర్గాలంటున్నాయి. అంటే దాదాపు రూ.25 కోట్లు. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిసి రూ.1.52 కోట్లు వచ్చింది. మిగిలిన భాషల్లో రూ.71 లక్షలు వచ్చాయి. నార్త్ ఇండియాలో రూ.55 లక్షలు వచ్చాయి. ఓవర్ సీస్లో రూ. 4.10 కోట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే రూ.21.10 కోట్లు షేర్ రాగా గ్రాస్ ప్రకారం చూస్తే రూ.38.65 కోట్లు అని ట్రేడ్ సమాచారం. ఈ మూవీనాని కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ రాబడుతుంది.
దసరా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏరియా వైజ్
నైజాం – రూ.6.78 కోట్లు
సీడెడ్ – రూ. 2.36 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.42 కోట్లు
ఈస్ట్ – రూ. 90 లక్షలు
వెస్ట్ – రూ. 55 లక్షలు
గుంటూరు – రూ. 1.22 కోట్లు
కృష్ణా – రూ. 64 లక్షలు
నెల్లూరు – రూ. 35 లక్షలు