
Das ka Dhamki: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు శిల్పకళా వేదికలో జరగనుంది.
ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. అయితే ఈ వేడుకకు చీఫ్ గెస్టుగా ఎన్టీఆర్ హాజరుకానున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.
#DasKaDhamki Pre-release Event On March 17th with #NTR pic.twitter.com/sgNNLEHFs0
— Thyview (@Thyview) March 15, 2023