
దళిత బంధుపై పలువురు నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. మల్లెపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్, బీజేపీ నేత డా.చంద్రశేఖర్ పిటీషన్ దాఖలు చేశారు. హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు యధావిధిగా కొనసాగించాలని నాయకులు కోరారు.
దళిత బంధుకు తాము వ్యతిరేకం కాదని పలువురు పార్టీ నేతలు చెబుతున్నారు. దళితుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన దళిత బంధును యధావిధిగా కొనసాగించాలని పిటిషనర్లు కోరారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ , హుజరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్, పోలీస్ కమిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.