
భారత టీ20 జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కోహ్లీ అభిమానులకి షాక్ ఇచ్చాడు. టీ20 జట్టు కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోనున్నాడు. వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్ నుంచి తప్పు కోనున్నట్లు తన అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. ఐదారు సంవత్సరాలుగా అన్ని ఫార్మాట్ లకి కెప్టెన్ గా వున్నానని పని ఒత్తిడి ఎక్కువ అయినందు వలన ఈ ఫార్మాట్ లో కెప్టెన్ గా వైదొలుగుతున్నట్లు ట్వియితీ ద్వారా వెల్లడించారు. టెస్ట్, వన్డే జట్టుకు కోహ్లీ కెప్టెన్ గా కొనసాగనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కోచ్ రవిశాస్త్రి, రోహిత్ శర్మ లతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. టీ 20 ఫార్మాట్ లో బాట్స్ మెన్ గా కొనసాగుతానని కోహ్లీ తెలిపాడు.
?? ❤️ pic.twitter.com/Ds7okjhj9J
— Virat Kohli (@imVkohli) September 16, 2021