
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ని అందుకున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో సోమవారం ముగిసిన రెండో టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన మహ్మద్ సిరాజ్.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 56వ ర్యాంక్ నుంచి ఒక్కసారిగా 18 స్థానాలు పైకి ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. గత ఏడాది డిసెంబరులో భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సిరాజ్‌కి ఇదే అత్యుత్తుమ ర్యాంక్. రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ 151 పరుగుల తేడాతో గెలుపొందగా.. మూడో టెస్టు మ్యాచ్ లీడ్స్ వేదికగా ఈ నెల 25 నుంచి ప్రారంభంకానుంది.
లార్డ్స్ టెస్టులో సెంచరీ నమోదు చేసిన కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12×4, 1×6).. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 19 స్థానాలు పైకి ఎగబాకి 37వ ర్యాంక్‌కి చేరుకున్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ.. తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు చేసినా.. అతని ర్యాంకింగ్స్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అలానే కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ర్యాంకింగ్స్‌లోనూ మార్పులు జరగలేదు. విరాట్ కోహ్లీ 776 పాయింట్లతో ఐదులో నిలవగా.. రోహిత్ శర్మ (773), రిషబ్ పంత్ (736) ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు.
లార్డ్స్ టెస్టులో సెంచరీ నమోదు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (180 నాటౌట్: 321 బంతుల్లో 18×4) బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు పైకి ఎగబాకి.. 893 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. టాప్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 901 పాయింట్లతో ఉన్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి అశ్విన్ 848 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. జస్ప్రీత్ బుమ్రా 754 పాయింట్లతో పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.