
మూడో టెస్టు రెండో రోజున ఆతిథ్య జట్టు మెరుగైన ప్రదర్శనతో భారత్ పై ఆధిపత్యం కొనసాగించింది. మూడో సెషన్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 423 పరుగులు చేసింది. తద్వారా 345 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.
కెప్టెన్ జోరూట్ (121), వన్ డౌన్ బ్యాట్స్ మన్ డేవిడ్ మలన్ (70) ఇంగ్లాండ్ కు భారీ స్కోర్ అందించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 139 పరుగులు జోడించి ఆ జట్టును తిరుగులేని స్థితిలో నిలిపారు. సిరాజ్ వేసిన 94వ ఓవర్ చివరి బంతికి మలన్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో ఇంగ్లాండ్ 298 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అప్పటికే ఇంగ్లాండ్ పటిష్ఠస్థితిలో నిలిచింది. టీ బ్రేక్ అనంతరం రూట్ శతకం పూర్తి చేసుకోగా తర్వాత ఇంగ్లాండ్ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట నిలిచిపోయేసరికి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ క్రేగ్ ఓవర్టన్(24), రాబిన్ సన్(0) క్రీజులో ఉన్నారు.
That's Stumps on Day 2 of the 3⃣rd #ENGvIND Test at Headingley!
England reach 423/8 & lead #TeamIndia by 345 runs.
3⃣ wickets for @MdShami11
2⃣ wickets each for @mdsirajofficial & @imjadeja121 for Joe Root
Scorecard ? https://t.co/FChN8SDsxh pic.twitter.com/l2C1RcnTxm
— BCCI (@BCCI) August 26, 2021