
Corona Cases: దేశంలో కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. గత 24 గంటల్లో 2,151 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గతేడాది అక్టోబర్ తర్వాత ఒకరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని తెలిపింది.
దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 11,903కు చేరింది. ఏడుగురు చనిపోగా, మొత్తం మరణాలు 5,30,848కు పెరిగాయి. కాగా, కరోనా టెస్టులు పెంచాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది.ి.