
Congress TRS alliance: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల పొత్తును ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తప్పదనుకుంటే బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పని చేస్తాయన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.