
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చ గొడుతున్నాడని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సంజయ్ తనతో నాలుగు అంశాలపై చర్చకు సిద్ధపడాలని సవాల్ చేశారు. హిందువుల కోసం బరాబర్ పని చేస్తానని ప్రకటించిన బండి సంజయ్… మరి హిందువుల కోసం తాను లేవనెత్తిన నాలుగు అంశాలపై చర్చకు సిద్ధమా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలోని 80 శాతం హిందువుల కోసం ప్రధాని మోదీతో మాట్లాడి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తావా ? అని ప్రశ్నించారు. తెలంగాణలోని పేద హిందువులకు ప్రధానితో మాట్లాడి రూ. 15 లక్షలు ఇప్పించగలవా? రాష్ట్రంలోని 80 శాతం మంది హిందువుల కోసం మాట పైన నిలబడగలవా? నిజాం భూములు తీసుకుని హిందువులకు ఇస్తామని చెప్పగలవా? అంటూ ప్రశ్నల వర్షం కురించారు. బీజేపీది రక్తం తాగే పులి లాంటి స్వభావమని ఆరోపించారు. బండి సంజయ్ ప్రజలకు మేలు చేయడం వదిలేసి మతాల మధ్య ఘర్షణలు రెచ్చ గొడుతున్నారని విమర్శించారు.