
నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన బాట పట్టనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో చేయాలంటూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నారు. పబ్లిక్ గార్డెన్ నుంచి బషీర్బాగ్ వ్యవసాయ కమిషనరేట్ వరకు ర్యాలీ కొనసాగనుంది. కాంగ్రెస్ ర్యాలీకి పోలీసులు అనుమతి లేదు. అయిన ర్యాలీ నిర్వహిస్తామని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.