
CM KCR: తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సీఎం కేసీఆర్ ఈ 8 ప్రభుత్వ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘రాష్ట్ర చరిత్రలో ఇది కొత్త అధ్యాయం. తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా మారుతోంది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2790కి పెరిగింది. తెలంగాణ వచ్చాక మెడికల్ సీట్లు దాదాపు 4రెట్లు పెరిగాయి. పీజీ సీట్లు 1180కి చేరాయి’ అని అన్నారు.