
CM KCR: ఈ నెల 15న టీఆర్ఎస్ఎల్పీ కీలక భేటీ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకావాలని అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని కీలక అంశాలపై కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం.
ప్రధానంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, బీఆర్ఎస్గా ఆవిర్భవించిన తర్వాత పార్టీ యంత్రాంగం ఎలా పనిచేయాలి, పార్టీ కమిటీలు, ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉంది.
అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, మునుగోడు విజయం, తనకున్న సెంటిమెంట్ల ప్రభావంతో మరింత ‘ముందుకు’ వెళ్లాలనే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో బీజేపీకి అభ్యర్థులు లేకపోవడం, ప్రజల్లో కాంగ్రెస్ పరిస్థితి… దానిపై ఏం చేయాలి, ప్రస్తుతం బీజేపీ వ్యవహార శైలి, గుజరాత్ ఎన్నికలు వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.