
తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 2021-22లో కొనసాగుతున్న ఖరీఫ్ (వానకాలం)లో బియ్యం సేకరణ లక్ష్యాన్ని 40 లక్షల టన్నులకు మించి పంజాబ్‌లో చేసినట్లుగా ఉత్పత్తిలో 90 శాతానికి పెంచేలా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)ని ఆదేశించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తదుపరి రబీ (యాసంగి) సీజన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ లక్ష్యాన్ని నిర్ధారించాలని కోరారు.
సీఎం కేసీఆర్ 2020- 21 ఎండాకాలం సీజన్ లో సేకరించకుండా మిగిలి వుంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని కూడా ఈ లేఖ లో డిమాండ్ చేశారు కేసీఆర్. ఇందుకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్జప్తి చేశారు కేసీఆర్.