
జాతీయ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతుల విషయంలో కేంద్రం వైఖరి దుర్మార్గమని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల కోసం ఉద్యమించిన రైతులలో 750 మంది వరకు రైతులు మరణించారని, వారి కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని అన్నారు.
ఉద్యమంలో మరణించిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున సాయం అందిస్తామని, కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారంగా అందించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో రైతులపై వేల సంఖ్యలో కేసులు నమోదు చేశారని, రైతులకు మద్దతు తెలిపిన అమాయకులపై నా కేసులు పెట్టారని ఆరోపించారు. ఆ కేసులన్నింటిని ఎత్తివేయాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు అంశంపై స్పందిస్తూ, బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలన్నారు. బాయిల్డ్ రైస్ ను కేంద్రం కొనబోవడంలేదంటూ ప్రచారం జరుగుతోందని, అందులో నిజమెంతో వెల్లడి కావాల్సి ఉందని పేర్కొన్నారు.