
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నింటినీ మరోసారి సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. యదాద్రి పునర్నిర్మాణం సీఎం కేసీఆర్ ఓ యజ్ఞం పూర్తి చేశారు. ఇప్పటికే చినజీయర్ స్వామి యాదాద్రి ఆలయం పున:ప్రారంభం తేదీ ముహూర్తాన్ని నిర్ణయించారు.