
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ పోస్టులు కోసం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు రేపు నామినేషన్ వేయనున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల రేసులో మధుసూదనా చారి, తాడూరి శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి లేదా ఎర్రోళ్ల శ్రీనివాస్, రవీందర్, కోటిరెడ్డి ఉన్నారు అని సమాచారం. ఈరోజు సాయంత్రమే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉంది.