
సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకొని, అక్కడ నుంచి హెలికాప్టర్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. సీఎం ఏరియల్ సర్వేకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.