
ఏపీలో భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జగన్ నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భాధితులకు కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శిబిరాల్లో ఉన్న వారికి ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయల సాయం ప్రకటించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.