
చైనాలో ప్రాణాంతక వైరస్లు మరోసారి విజృంభించాయి. కొందరు శాస్త్రవేత్తలు చైనాలో జంతువుల మాంసాన్ని విక్రయించే మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు నిర్వహించారు. ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, బెల్జియం దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలో పాల్గొన్నారు. వారు 16 జాతులకు చెందిన 1725 వన్యప్రాణులను పరిశోధించారు.
అయితే ఈ పరీక్షలో శాస్త్రవేత్తలు 71 రకాల వైరస్లను గుర్తించారు. వీటిలో 18 ప్రమాదకరమైన వైరస్లని వారు వెల్లడించారు. 45 రకాల వైరస్లు కొత్తవని వెల్లడించింది. పిల్లుల మాదిరిగా ఉండే సివెట్స్లో అత్యంత ప్రమాదకరమైన వైరస్లు ఉన్నట్లు గుర్తించారు.