
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని ఏడుగురు నేతల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. చంద్రబాబు వెంట ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సహా పలువురు నేతలున్నారు.
ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతోందని, గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల తెదేపా కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఏక కాలంలో జరిగిన దాడులను వివరించినట్లు సమాచారం.