
Chandra Grahan: నేడు హైదరాబాద్ లో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించనుంది. గ్రహణం సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభమయ్యి 46 నిమిషాల తర్వాత 7.26 గంటలకు ముగుస్తుందని జీపీ బిర్లా ఆర్కియాలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. గ్రహణాన్ని నేరుగా వీక్షించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. కాగా ఈ ఏడాది ఇదే చివరి గ్రహణం. గ్రహణం కావడంతో ఇప్పటికే ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి.