
Cabinet Meeting: మంగళవారం ఏపీ కేబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో విశాఖకు వెళ్తున్నామని, జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తామని అన్నారు. సక్రమంగా పనిచేయని మంత్రులపై వేటు తప్పదని, కేబినెట్ లో మార్పులు తప్పవని సీఎం జగన్ హెచ్చరించినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలన్నీ గెలవాలని సీఎం జగన్ అన్నట్లు సమాచారం.