
ఈ రోజుల్లో క్యాబ్ సర్వీస్ వాడడం సాధారణం. మనం ఎక్కడికి వెళ్లాలన్న, ఆటో కానీ క్యాబ్ చేసుకొని వెళ్తాము. కొందరు క్యాబ్ డ్రైవర్లు మనం బుక్ చేసిన తర్వాత కొంత సేపటికి రైడ్ క్యాన్సిల్ చేస్తారు. ఇలా చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడతాము. టైం కూడా వేస్ట్ అవుతుంది. మల్లి ఇంకో క్యాబ్ బుక్ చేసుకొని వస్తే అందులో బయలుదేరుతాము. బుక్ అయినా క్యాబ్ క్యాన్సిల్ చేయడం వల్ల ఫైన్ కూడా పడుతూ ఉంటుంది. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేస్తే సరి..
మీరు క్యాబ్ బుక్ చేశాక.. మీ బుకింగ్ కన్ఫమ్ అయ్యాక కూడా క్యాబ్ డ్రైవర్ రైడ్‌ను క్యాన్సిల్ చేశాడని అనుకుందాం. అందుకని… మీ బుకింగ్ కన్ఫమ్ కాగానే.. క్యాబ్ డిటెయిల్స్‌ను స్క్రీన్ షాట్ తీయండి. అందులో క్యాబ్ నెంబర్ కూడా ఉండాలి. యాప్‌లో క్యాబ్ బుకింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి దాన్ని మీ సిటీలోని ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో కానీ.. వాట్సప్ ఖాతాలో కానీ షేర్ చేయండి. స్క్రీన్ షాట్‌తో పాటు మీ డెస్టినేషన్, బండి నెంబర్, డేట్, టైమ్, లొకేషన్.. అన్ని వివరాలను షేర్ చేయండి.
ఆ క్యాబ్ నెంబర్‌ను ట్రాక్ చేసి.. ఆ కారుకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. ఎందుకంటే.. ఒకసారి ప్యాసెంజర్ క్యాబ్ బుక్ చేసుకున్నాక.. దాన్ని క్యాన్సిల్ చేయడం చట్టరిత్యా నేరం. మోటార్ వెహికిల్స్ యాక్ట్ 1988లోని 178 వ సెక్షన్ ప్రకారం ఆ రైడ్‌ను క్యాన్సిల్ చేసిన క్యాబ్ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధిస్తారు. దీంతో ఇంకోసారి ఆ డ్రైవర్ మరో రైడ్‌ను క్యాన్సిల్ చేయడు.