
అమెజాన్ ఈ కామర్స్ సైట్ ద్వారా షాపింగ్ చేసే వారికి గుడ్ న్యూస్, తన కస్టమర్ల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏదైనా వస్తువు కొన్న తర్వాత డబ్బులు తర్వాత చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది. (బయ్ నౌ.. పే లేటర్) అనే ప్రాజెక్ట్ కింద తన కస్టమర్ లను ఆకట్టుకునేలా ఈ ప్రాజెక్ట్ తీసుకు వచ్చింది, దీని కోసం అఫిర్మ్ అనే సంస్థలో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంపిక చేసిన కొద్ది మందికే ఈ ఆఫర్ మొదట ఇవ్వనుంది.
దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమెరికాలో ప్రారంభించి ఆ తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు వర్తింపజేయనున్నారు. మన దగ్గర క్రెడిక్ కార్డు ఈఎంఐలే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
ఈ బయ్ నౌ పే లేటర్ ఆప్షన్‌ను అమెజాన్ కస్టమర్ బేస్‌లో పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల వారు ఉన్నారు. అయితే వీరిలో యూత్ , పార్ట్ టైం జాబ్ చేసే వాళ్లనే లక్ష్యంగా ఈ కొత్త పథకాన్ని అమెజాన్ తీసుకొచ్చింది. కాగా, షాపింగ్ చేసేది అమెజాన్ సైట్లో అయినా సొమ్ము చెల్లింపు వ్యవహారం సజావుగా జరిగేలా చూసుకునే బాధ్యత అఫిర్మ్ స్టార్టప్దే.