
ఈ నెల 15న గవర్నర్ బిశ్వభూషణ్‌ను అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించారు.
ఈ రోజు పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.