
బిగ్‌బాస్ ఇంట్లో కెప్టెన్ గా షణ్ముఖ్ విజయం సాధించినట్టు తెలుస్తోంది. ‘అభయహస్తం’ టాస్క్‌లో పెట్టిన పలు ఛాలెంజ్‌లను సమర్థవంతంగా పూర్తి చేసిన షణ్ను, మానస్, సన్నీ, సిరి, యానీ, శ్రీరామ్ ‘వెంటాడు- వేటాడు’ అనే కెప్టెన్సీ టాస్క్‌లో పోరాడనున్నారు. ఈ గేమ్‌లో పోటీదారులు ఇతరుల థర్మాకోల్ బస్తాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఆటలో భాగంగా శ్రీరామ్ సన్నీని నెట్టేయడంతో అతడు కింద పడ్డాడు. నన్నే నెట్టేస్తాడా? దీంతో శ్రీరామ్, సన్నీల మధ్య ఫైట్ జరిగింది.
ఈ కెప్టెన్సీ టాస్క్‌లో షణ్ముఖ్ విజయం సాధించి బిగ్‌బాస్ హౌస్‌కు కెప్టెన్‌గా అవతరించినట్టు తెలుస్తోంది. షణ్ను.. తన రేషన్ మేనేజర్ గా యానీ మాస్టర్ ను నియమించినట్టు సమాచారం! మరి కెప్టెన్ షణ్ను మౌజ్ రూం నుండి బయటకు వస్తాడో లేదో చూడాలి.