
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటూ బుల్లితెర మీద మ్యాజిక్ చేస్తోంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఇద్దరు ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం 17 మంది ఉన్నారు. ఈ ఆదివారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే కరోనా కల్లోలం మధ్య ‘బిగ్ బాస్ సీజన్ 5’ జరుగుతుంతో లేదో అనే అనుమానం అందరిలో ఉండేది. కాని సెప్టెంబర్ 5న ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేసి ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నారు. వంద రోజులకు పైగా కొనసాగే ఈ కార్యక్రమంలో విజేత ఎవరు నిలుస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ విజేత ఎవరో అనే విషయం గూగుల్ వెల్లడించేయడం ఆసక్తి కలిగిస్తోంది.
గూగుల్ లో ‘బిగ్ బాస్ 5 విన్నర్’ అని సెర్చ్ చేస్తే మాజీ ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామచంద్ర పేరును చూపిస్తోంది. ఇంకా ఈ షో స్టార్ట్ అయ్యి మూడో వారమే అయ్యింది. అప్పుడే గూగుల్ ఇలా విన్నర్ అంటూ శ్రీరామచంద్ర పేరును చూపించడం విశేషం. ఇక ‘బిగ్‌బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్’ ఎవరని టైప్ చేస్తే ప్రియాంక సింగ్‌ను విజేతగా చూపిస్తోంది. ఇది బుల్లితెర ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తోంది.
ఇక, ప్రస్తుతం గూగుల్ వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ‘గూగుల్ వాడు 90 వేసినట్టు ఉన్నాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటికే శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ సీజన్ 5 విజేతగా నిలువడం, అంతేకాకుండా ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్లో కంటెస్టెంట్‌గా ఉండటం వల్ల డేటాబేస్ సెర్చ్‌లో తప్పు చోటు చేసుకుని ఉంటుందని టెక్నికల్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ గూగుల్ తప్పిదాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. కాగా శ్రీరామచంద్రకు ప్రస్తుతం షోలో మంచి ఫుటేజీ దక్కుతోంది. హమీదాతో లవ్ ట్రాక్ నడుపుతుండటంతో కావాల్సినంత స్క్రీన్ స్పేస్ దొరుకుతోంది. అటు టాస్క్‌ల్లోనూ బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. మరి గూగుల్ చెప్పినట్లుగా రానున్న రోజుల్లో శ్రీరామ్ లేదా ప్రియాంక సింగ్ బిగ్‌బాస్ విజేతగా అవతరిస్తారా అనేది చూడాలి!