
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ ‘భీమ్లా నాయక్’, సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా మలయాళం లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్, రానా మరో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. చిత్రీకరణ పరంగా చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలోని మొదటి పాటను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున సెప్టెంబర్ 2న విడుదల చేయాలనీ అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసినట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం వారు 5.04 కోట్లు చెల్లించినట్టుగా తెలుస్తోంది. డ్యూయెట్లు పెద్దగా లేనప్పటికీ, సందర్భానుసారం వచ్చే పాటలు ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.