
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానుబంధాలకు, ఒకరికొకరు అండగా ఉంటామని చాటి చెప్పే పండగ రాఖీ పౌర్ణమి. భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి అయిన రాఖీ పండగ ఆదివారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. రక్షాబంధన్ భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ.. నా మేనకోడళ్లందరికీ రాఖీ పండగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నానని ఏపీ సీఎం జగన్ తెలిపారు.
Raksha Bandhan greetings to all fellow citizens! The festival is a symbol of love, affection and trust.
Let us resolve to build a harmonious society where safety and dignity of women are given utmost importance and they fulfil their aspirations freely.— President of India (@rashtrapatibhvn) August 22, 2021
సోదరుడు, సోదరి మధ్య అవ్యాజమైన ప్రేమకు ప్రతిరూపమైన రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు. మనతో రక్తం పంచుకుని పుట్టిన వారే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ మన సోదరులే అనే భావన పెంపొందించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ఒకరికొకరు రక్షణగా దేశాభివృద్ధి కోసం యువత ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను. #Rakhi
— Vice President of India (@VPSecretariat) August 22, 2021
सभी देशवासियों को रक्षाबंधन के पावन पर्व पर ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) August 22, 2021
CM Sri KCR greeted Telangana people on the occasion of Rakhi Pournami. CM said that #RakshaBandhan observed on this day all over the country stands as a symbol of love and affection between siblings. pic.twitter.com/nFgSBTT56t
— Telangana CMO (@TelanganaCMO) August 22, 2021
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా దేశచరిత్రలోనే మహిళా సాధికారత విషయంలో ఎవ్వరూ వేయనన్ని ముందడుగులు వేసిన ప్రభుత్వంగా… రాష్ట్రంలోని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అమ్మకూ, నా మేనకోడళ్లు అందరికీ రాఖీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 22, 2021